శశికళ రీ ఎంట్రీపై అధిష్ఠానందే నిర్ణయం: పన్నీర్ సెల్వం
O Panneer Selvam: ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి

చెన్నై: ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలోకి ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రీ ఎంట్రీపై.. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తిరిగి ఏఐఏడీఎంకేలో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వెళ్లిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ ఇటీవల తన పేరుతో ఒక ఫలకాన్ని తయారు చేయించారు. ఆ ఫలకాన్ని పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీ రామంచంద్రన్ మెమోరియల్ వద్ద ఆవిష్కరించారు. ఆ ఫలకంపై శశికళ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ అని రాయించుకున్నారు. దీనిపై అన్నాడీఎంకే గత వారం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో శశికళ అన్నాడీఎంకేలో చేరుతున్నారా..? అన్నా మీడియా ప్రశ్నకు పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

