Agnibaan | అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం వాయిదా..! కారణాలు ఏంటంటే..?
Agnibaan | చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి రద్దయ్యింది. లిఫ్ట్‌ఆఫ్‌కు దాదాపు 92 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపాలతో వాయిదా వేసినట్లు అగ్నికుల్ కాస్మోస్ పేర్కొంది.
Agnibaan | చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి రద్దయ్యింది. లిఫ్ట్‌ఆఫ్‌కు దాదాపు 92 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపాలతో వాయిదా వేసినట్లు అగ్నికుల్ కాస్మోస్ పేర్కొంది. అగ్నిబాన్ సెమీ క్రయోజెనిక్ రాకెట్. ఈ టెస్ట్ ఫ్లైట్‌ను శ్రీహరికోటలోని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించాల్సి ఉంది. ఇంతకు ముందు శనివారం ఉదయం 7.45 గంటలకు ప్రయోగం చేపట్టేందుకు ప్రయత్నం చేసినా విజయవంతం కాలేదు.
ఈ క్రమంలో ఆదివారం లాంచ్ చేయాలని నిర్ణయించగా.. మరోసారి వాయిదా పడింది. ఐఐటీ చెన్నై ఇంక్యుబేట్ స్టార్టప్ ప్రకారం.. అగ్నిబాన్ ప్రయోగాన్ని రాకెట్ లాంచ్ సమయానికి 92 ముందు నిలిచిపోయింది. స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ 2022 నవంబర్‌లో విక్రమ్ ఎస్ సబ్ ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. దేశంలోనే రెండో ప్రైవేట్ రాకెట్‌ను అగ్నికుల్‌ను ప్రయోగించాలని కంపెనీ భావించింది. ఈ రాకెట్ దాదాపు 700 కిలోమీటర్ల కక్ష్యలోకి 300 కిలోల వరకు పేలోడ్‌ను మోసుకువెళ్లగలదని కంపెనీ పేర్కొంది. ఈ రాకెట్లో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇప్పటి వరకు ఈ సాంకేతికను వినియోగించలేదు. దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. అగ్నిబాన్ రాకెట్ అగ్నిలెట్ ఇంజిన్‌తో రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి దూసుకెళ్తుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌ని ప్రయోగిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agnibaan
- Agnikul Cosmos
- ISRO
- Shar
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

