బెంగాల్ ఫలితాల తర్వాత వేలాది మంది గ్రామాలను వీడుతున్నారు: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తమను క్షమించాలని మమతా బెనర్జీ, టీఎంసీని వేడుకుంటున్నారని, మతం మరేందుకు కూడా సిద్ధమని చెబుతున్నారని విమర్శించారు. మహిళలను ఇండ్ల నుంచి బలవంతంగా తీసుకెళ్లి బహిరంగ లైంగికదాడికి పాల్పడుతున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. దళిత లేదా గిరిజన మహిళలను కూడా వదిలిపెట్టడం లేదని విమర్శించారు.
ఆరేండ్ల మనువడి ముందు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 60 ఏండ్ల మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని స్మృతి ఇరానీ తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం వల్లనే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది మహిళలు ఇలాంటి దారుణాలను మౌనంగా భరించాలి అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల కార్లపై రాళ్ల దాడి జరుగుతున్నప్పుడు వారి రాష్ట్రంలో సామాన్యులు సురక్షితంగా ఉన్నారా? అని మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారిని తాను ప్రశ్నించాలనుకుంటున్నానని అన్నారు. అత్యాచారానికి గురైన మహిళల కోసం ప్రెస్ క్లబ్ ముందు ఎందుకు నిరసన తెలుపలేదు అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

