Caught on camera: పొలం వివాదంపై ఘర్షణ.. మేనల్లుడి ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపిన వ్యక్తి
Caught on camera | ఆగ్రహించిన బగ్గా తన వద్ద తుపాకీని ఎక్కుపెట్టాడు. ఎదురుగా ఉన్న మేనల్లుడు హమీద్ ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
జైపూర్: పొలం వివాదంపై ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు. మేనల్లుడి ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీవర్ ప్రాంతానికి చెందిన బగ్గా అనే వ్యక్తి తన మేనల్లుడు హమీద్ పొలంలో మట్టి తవ్వుతున్నాడు. అయితే అతడి మేనల్లుడు దీనిని గమనించి అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పొలంలోని మట్టిని తవ్వ వద్దని బగ్గాకు చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య ఈ అంశంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బగ్గా తన వద్ద ఉన్న తుపాకీని ఎక్కుపెట్టాడు. ఎదురుగా ఉన్న మేనల్లుడు హమీద్ ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు బగ్గా తనపై కాల్పులు జరిపిన సంఘటనను మేనల్లుడు హమీద్ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. హమీద్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

