Woman Dies By Suicide | భర్త మరణాన్ని తట్టుకోలేక.. భార్య ఆత్మహత్య
Woman Dies By Suicide | భర్త మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న భర్త మృతదేహాన్ని చూసిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
న్యూఢిల్లీ: భర్త మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న భర్త మృతదేహాన్ని చూసిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. (Woman Dies By Suicide ) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల జుమీ దాస్, 27 ఏళ్ల ఆమె భర్త భాస్కర్ డేకా అస్సాంకు చెందినవారు. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఈ దంపతులు నివసిస్తున్నారు. చాందినీ చౌక్ ప్రాంతంలోని మాల్లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా జుమీ, సెక్యూరిటీ గార్డుగా ఆమె భర్త పని చేస్తున్నాడు.
కాగా, శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సామీ భాషలో సూసైడ్ లేఖ రాశాడు. భార్యపై తన ప్రేమను అందులో వ్యక్తం చేశాడు. ఆమెను అస్సాం నుంచి ఢిల్లీకి తీసుకువచ్చి తాను తప్పు చేశానని పేర్కొన్నాడు. అలాగే అందరికీ క్షమాపణలు చెప్పాడు.
మరోవైపు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న భర్త మృతదేహాన్ని చూసి భార్య జుమీ షాక్ అయ్యింది. తాను కూడా చనిపోతున్నానని స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆ తర్వాత యమునా ఖాదర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నీటి పైప్లైన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భార్యాభర్తల ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు అస్సాంలోని వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

