Watch: బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రియురాలిని తోసి పరారైన యువకుడు
Youth Throws Off Girl friend From Bike and Flees | ఒక బైక్‌ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చొన్న ప్రియురాలిని కిందకు తోసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కోల్‌కతా: ఒక బైక్‌ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చొన్న ప్రియురాలిని కిందకు తోసి అక్కడి నుంచి పారిపోయాడు (Youth Throws Off Girlfriend From Bike and Flees). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు. ఒక జంక్షన్ వద్ద ఆ బైక్‌ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీస్ ప్రయత్నించాడు. దీంతో అతడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు. వేగంగా పారిపోయేందుకు బైక్‌ను రైజ్ చేయడంతో బైక్ వెనుక కూర్చొన్న ప్రియురాలు అదుపుతప్పి రోడ్డుపై పడింది.
కాగా, ప్రియురాలు బైక్ నుంచి కిందపడినప్పటికీ ఆ యువకుడు పట్టించుకోలేదు. అడ్డుగా వచ్చిన స్కూటీ వ్యక్తిని తప్పించుకుని బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే గాయపడిన యువతిని ట్రాఫిక్ పోలీస్ రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. ఆమె ద్వారా ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నాడు. అభిషేక్ ఆనంద్ అనే జర్నలిస్ట్, సోమవారం ఎక్స్‌లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. ‘ఈ అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్ కోసం చలాన్ చెల్లించలేకపోయాడు. అందుకే ఆమెను బైక్ పై నుంచి తోసి పారిపోయాడు. అలాంటి వ్యక్తితో బ్రేకప్ కోసం ఈ అమ్మాయి ఆలస్యం చేయకూడదు’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది ఆ జర్నలిస్ట్ వెల్లడించలేదు. అయితే ట్రాఫిక్ పోలీసుల డ్రెస్ ఆధారంగా పశ్చిమ బెంగాల్లో ఇది జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందించారు. ప్రియురాలిని వదిలి పారిపోయిన యువకుడి తీరును పలువురు తప్పుపట్టారు.
लड़की को breakup में देर नहीं करनी चाहिए
ऐसे बहुत आयेंगे जाएँगे
यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका
बीच सड़क बाइक से उतार दिया— Abhishek Anand (@TweetAbhishekA) August 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- flees
- Girl Friend
- Throws Off
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

