CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
CJP Plan B | ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనలకు కీలక సభ్యుడు అజింక్య షిండే నేతృత్వం వహించనున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అతడి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్లాన్ ‘బి’ అమలుకు రంగం సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనలకు కీలక సభ్యుడు అజింక్య షిండే నేతృత్వం వహించనున్నారు. ( CJP Plan B) సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అతడి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్లాన్ ‘బి’ అమలుకు రంగం సిద్ధమైంది. ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరిన అభిజీత్ దిప్కే, సీజేపీ సభ్యులైన సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాగానే విమానంలో ఉండగానే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అజ్ఞాత ప్రదేశానికి వారిని తరలించారు.
కాగా, ఢిల్లీ పోలీసుల ఎత్తుగడలను ముందుగానే ఊహించిన సీజేపీ ప్లాన్ ‘బి’ని సిద్ధం చేసింది. శనివారం విడుదల చేసిన ఒక ముందస్తు రికార్డెడ్ వీడియోలో అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ప్రకటించారు. అగ్రనాయకత్వం అందుబాటులో లేని సమయంలో నిరసనల బాధ్యతలను అజింక్య షిండేకు అప్పగిస్తున్నట్లు అందులో తెలిపారు. ‘మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే, నాతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకా అరెస్టయ్యామని అర్థం. మా గైర్హాజరీలో నిరసన కార్యక్రమాలకు, సీజేపీ ఉద్యమానికి అజింక్య నాయకత్వం వహిస్తారు. దయచేసి ఆయనను అనుసరించండి’ అని ఆ వీడియోలో దిప్కే పేర్కొన్నారు. అభిజిత్ దీప్కే బృందాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకోగానే సీజేపీ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
IMPORTANT
Until Abhijeet Dipke, Saurav Das and Ashutosh Ranka are in detention, CJP’s Organization In-Charge Ajinkya Shinde will lead this protest at Jantar Mantar.
Abhijeet had pre-recorded this video last night in anticipation of a potential arrest. @AjinkyaCJP https://t.co/WSQ69mKfTV
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

