ఐరాస కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు నిరసన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు సోమవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు, తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లోని ఆఫ్ఘన్ల శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని, మూడవ దేశంలో పునరావాసం ఎంపిక, UNHCR, భారత ప్రభుత్వం నుంచి భద్రతకు భరోసా వంటి డిమాండ్లను ప్రస్తావించారు. ఈ మేరకు పలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు భారత్‌లో 21,000 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారని భారత్‌లోని ఆఫ్ఘన్ కమ్యూనిటీ హెడ్ అహ్మద్ జియా ఘని తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి వెళ్లేందుకు తగిన పరిస్థితులు, కారణాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ శరణార్థులకు పూర్తి స్థాయిలో పునరావాసం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

