Anna Hazare | రాజకీయాల్లోకి రావద్దని సూచించా.. కేజ్రీవాల్ వినలేదు: అన్నా హజారే
Anna Hazare | మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను గతంలోనే సూచించినట్లు తెలిపారు. అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు.
ముంబై: మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు.
రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను గతంలోనే సూచించినట్లు తెలిపారు. అయితే ఆయన తన మాట వినలేదని విమర్శించారు. ‘రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు ఇప్పటికే సలహా ఇచ్చా. సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని చాలాసార్లు వివరించా. కానీ ఆయన వినలేదు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకూడదని నేను మొదటి నుంచి చెబుతున్నా. ఆయన నా సలహాను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరిగింది అనివార్యం. అరవింద్ కేజ్రీవాల్ మనసులో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు’ అని మీడియాతో అన్నారు.
కాగా, అన్నా హజారే గతంలో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన శిష్యుడిగా పేర్కొనే అరవింద్ కేజ్రీవాల్‌పై పలుసార్లు స్పందించారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌పైనా అన్నా హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఒకప్పుడు నాతో పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం విధానాలను రూపొందించడంలో నిమగ్నం కావడంపై నేను తీవ్రంగా కలత చెందా. సొంత చర్యల పర్యవసానమే ఆయన అరెస్ట్’ అని వ్యాఖ్యానించారు.
VIDEO | “I told him since the beginning that you should not join politics but serve the people. We have worked together for many years and told him the same thing. He never listened to me and today what had to happen has happened,” says social activist Anna Hazare on Delhi CM… pic.twitter.com/o3WkRxfAGD
— Press Trust of India (@PTI_News) September 15, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

