ADR | ఆ రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలి..! ఎన్నికల కమిషన్‌ను కోరిన ఏడీఆర్..!
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల స్థాయిల్లో రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లో స్వభావంతో సహా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పబ్లిస్ చేయడం తప్పనిసరని పేర్కొంది. పార్టీలు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సవివరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాలని, నేరచరితులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయలేకపోవడాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, గతంలో అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు, వారి ఎంపికకు గల కారణాలతో పాటు జాబితాను పబ్లిష్ చేయడంలో విఫలమైనందుకు పలు పార్టీలను సుప్రీంకోర్టు మందలించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పది రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించనందుకు జరిమానా సైతం విధించింది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులు ప్రదర్శించని పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డిమాండ్ చేస్తున్నది.
2023లో జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటకతో పాటు గతేడాది 2022లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్, 2021 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలు ఎన్నికలు జరిగాయి. దాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇలాంటి లోపాలను వెంటనే సుప్రీంకోర్టుకు నివేదించాలని, ఉల్లంఘనకు జరిమానా విధించే అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించాలని లేఖలో ఏడీఆర్ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

