Adjournment Motion: బంగ్లాదేశ్‌పై చర్చించండి.. ఉభయసభల్లో వాయిదా తీర్మానం
Adjournment Motion: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఇవాళ ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా , లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఈ తీర్మానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఇవాళ ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానా(Adjournment Motion)లు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాలని, ఆ దేశం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి చర్చించాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఈ తీర్మానం ప్రజెంట్ చేశారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.
ప్రస్తుతం షేక్ హసీనా .. ఇండియాలోనే ఉన్నారు. అయితే లండన్‌లో ఆమెకు ఆశ్రయం దొరికితే వరకు ఆమె ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

