Aditya L-1 | ఆదిత్య ఎల్-1 మిషన్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని అందించిన ఇస్రో..!
Aditya L-1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదిత్య ఎల్-1 నుంచి మాగ్నెటోమీటర్ బూమ్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని సహాయంతో అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలవడం దీని ఉద్దేశ్యం. మాగ్నోమీటర్ బూమ్ ఆరు మీటర్ల పొడవు ఉంటుంది.
Aditya L-1 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదిత్య ఎల్-1 నుంచి మాగ్నెటోమీటర్ బూమ్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని సహాయంతో అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలవడం దీని ఉద్దేశ్యం. మాగ్నోమీటర్ బూమ్ ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. ఇది జనవరి 11న L-1 పాయింట్‌లోని హెలో ఛాంబర్లో మోహరించామని, ప్రయోగం తర్వాత బూమ్ స్థిరమైన స్థితిలో ఉందని ఇస్రో తెలిపింది. మాట్నెటోమీటర్ బూమ్‌లో రెండు అత్యాధునికమైన ఫ్లెక్స్గేట్ మాగ్నోమీటర్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి అంతరిక్షంలో తక్కువ తీవ్రత అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలుస్తుంటాయి.
వ్యోమనౌక నుంచి మూడు, ఆరు మీటర్ల దూరంలో ఈ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. దూరంలో ఈ సెన్సార్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్‌షటిల్ అయస్కాంత క్షేత్రం ప్రభావం తగ్గుతుంది. సెన్సార్లను ఉపయోగించడం ఈ ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడుతుందని, వ్యోమనౌక అయస్కాంత ప్రభావాన్ని తగ్గించడాన్ని సులభతరం చేస్తుందస్స్రో పేర్కొంది. బూమ్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు ఇస్రో వివరించింది.
ఇది సెన్సార్లకు ఇంటర్ఫేస్గా పని చేస్తుందని. ఇదిలా ఉండగా.. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్-1 పాయింట్లోకి ఉపగ్రహం చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ 2న ప్రయోగించగా.. 127 రోజుల తర్వాత నిర్ధిష్ట కక్ష్యలోకి చేరుకుంది. ఎల్-1 పాయింట్ వద్ద నుంచి సౌర తుఫానులు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

