Food Delivery | ఇకపై వర్షంలో ఫుడ్ డెలివరీ చేస్తే అదనపు చార్జీలు.. చందాదారులకు జొమాటో, స్విగ్గీ షాక్
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తమ చందాదారులకు షాక్ ఇచ్చాయి. ఇకపై వర్షం పడుతుండగా ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా చార్జీలు చెల్లించాల్సిందేనని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రీమియం చందాదారులకు వర్తిస్తున్న రెయిన్ సర్‌చార్జ్ మినహాయింపును తొలగిస్తున్నట్టు జొమాటో, స్విగ్గీ తాజాగా ప్రకటించాయి.
Food Delivery | న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తమ చందాదారులకు షాక్ ఇచ్చాయి. ఇకపై వర్షం పడుతుండగా ఫుడ్ డెలివరీ చేయాలంటే యూజర్స్ అదనంగా చార్జీలు చెల్లించాల్సిందేనని ప్రకటించాయి. ఇప్పటివరకు ప్రీమియం చందాదారులకు వర్తిస్తున్న రెయిన్ సర్‌చార్జ్ మినహాయింపును తొలగిస్తున్నట్టు జొమాటో, స్విగ్గీ తాజాగా ప్రకటించాయి. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమలు చేస్తున్నట్టు తమ యాప్ నోటిఫికేషన్లో ఓ సందేశాన్ని విడుదల చేశాయి. దీని ప్రకారం, ఇకపై స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్ చందాదారులు (ప్రీమియం సబ్‌స్ర్కైబర్స్) అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. స్విగ్గీ వన్ పేరుతో స్విగ్గీ, జొమాటో గోల్డ్ పేరుతో జొమాటో తన కస్టమర్లకు ప్రీమియం సేవలు అందిస్తున్నాయి.
వీటిని కొనుగోలు చేసిన వారికి రెండు సంస్థలు పలు ప్రత్యేక ప్రయోజనాల్ని కల్పిస్తున్నాయి. వాటిలో రెయిన్ సర్‌చార్జ్ మినహాయింపు కూడా ఒకటి. అయితే, తాజాగా ఈ సదుపాయాన్ని చందాదారులకు తొలగించాయి. భారీగా వర్షం పడే సమయంలో ఈ సర్‌చార్జ్ రూ.15 నుంచి రూ.30 వరకు విధించే అవకాశముంది. ఈ సంస్థలు ఇప్పటికే డెలివరీ ఫీజుకు అదనంగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పనిచేసే తమ డెలివరీ పార్ట్నర్స్కు మంచి పారితోషికం అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జొమాటో, స్విగ్గీ పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

