రాష్ట్రాలకు మరో 19,420 ఆంఫోటెరిసిన్-బి బుడ్డీలు: కేంద్రం
Amphotericin B Injections: కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిని ఆ తర్వాత ఫంగస్‌లు వేధిస్తున్నాయి.

న్యూఢిల్లీ: కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిని ఆ తర్వాత ఫంగస్‌లు వేధిస్తున్నాయి. ఇప్పటికే వారిలో బ్లాక్, వైట్ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించగా, తాజాగా కొందరిలో యెల్లో ఫంగస్ ఆనవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ యెల్లో ఫంగస్ నుంచి రోగులు కోలుకోవడానికి ఆంఫోటెరిసిన్-బి అనే ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. అందుకే కేంద్ర సర్కారు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ బుడ్డీలను సరఫరా చేస్తున్నది.
ఇప్పటికే ఈ నెల 21న 23,680 ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ బుడ్డీలను రాష్ట్రాలకు సరఫరా చేసిన కేంద్రం, ఈ నెల 24న మరో 19,420 బుడ్డీలను సప్లయ్ చేసిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ వెల్లడించింది. తాజాగా పంపిణీ చేసిన ఇంజెక్షన్ బుడ్డీల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

