Gautam Adani: మనవరాలు కావేరితో ఫోటో.. గౌతమ్ అదానీ క్యాప్షన్ ఇదీ
Gautam Adani: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ 14 నెలల మనవరాలు కావేరి ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. చిన్నారి కండ్లల్లో వెలుగులు చూస్తుంటే.. ప్రపంచంలో ఉన్న సంపద అంతా వెలవెలబోతుందన్నారు.
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ 14 నెలల మనవరాలు కావేరి ఫోటోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. కుమారుడు కరణ్ అదానీ, పారిది .. ఆ పాపకు తల్లితండ్రులు. అయితే గౌతమ్ అదానీ ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిన్నారి కండ్లల్లో వెలుగులు చూస్తుంటే.. ప్రపంచంలో ఉన్న సంపద అంతా బోసిపోతుందని అన్నారు. ఇన్ ఆంకో కి చమక్ కే ఆగే దునియా కి సారి దౌలత్ పీకీ హై అంటూ పోస్టు చేశారు.
లండన్‌లో ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీలోని సైన్స్ మ్యూజియంలో ఈ ఫోటో దిగారు.మనవరాలు కావేరిని ఎత్తుకున్న అదానీ .. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అదానీ భార్య, కావేరి పేరెంట్స్ కూడా ఆ సందర్భాన్ని ఎంజాయ్ చేశారు. జీవితంలో వత్తిడిని పోగొట్టేవాళ్లు అని చైర్మన్ అదానీ తన మనవరాళ్ల గురించి కామెంట్ చేశారు.
మనవరాళ్లతో టైం గడిపేందుకు ఇష్టపడుతానని, నా వత్తిడిని తగ్గించడంలో వాళ్లే కీలకమని, తనకు రెండు ప్రపంచాలు ఉన్నాయని, ఒకటి పని, రెండోది కుటుంబం అని గౌతమ్ అదానీ అన్నారు. తన కుటుంబమే తనకు బలమని ఆయన తెలిపారు.
इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR
— Gautam Adani (@gautam_adani) April 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

