Actress Trisha : నటి త్రిష (Actress Trisha) టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) నివాసానికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో విజయ్‌కి అభినందనలు తెలిపేందుకు ఆమె ఆయన నివాసానికి వెళ్లింది. అంతకుముందు ఆమె తన 43వ పుట్టినరోజు (Birthday) సందర్బంగా తిరుమల (Tirumala) ను సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు తీసుకుంది. అనంతరం తమిళనాడు (Tamil Nadu) కు చేరుకుని విజయ్ నివాసానికి వెళ్లింది.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai.
TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ
— ANI (@ANI) May 4, 2026
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అద్బుత ఫలితాలు సాధించింది. అధికార ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డీఎంకే పరిస్థితి దారుణంగా మారింది. ఆ పార్టీ ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే వెనుకబడి మూడోస్థానానికి పరిమితమైంది. అన్నాడీఎంకే 70 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, డీఎంకే 50 కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. విజయ్ పార్టీ సత్తా చాటడంతో ఆయన నివాసం వద్ద, పార్టీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు.
మరికాసేపట్లో సంబురాలు మొదలుపెట్టేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. నియోకవర్గాల్లో, జిల్లా పార్టీ కార్యాలయాల్లో, తమిళనాడు రాజధాని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబురాలు జరగనున్నాయి. ఈ క్రమంలో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి, విజయ్ నివాసానికి చేరుకుంటున్నారు. విజయోత్సాహంలో తమ నేతను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.