లౌడ్ స్పీకర్, చాలీసా వివాదంపై సోనూసూద్ రియాక్షన్ ఇదీ..
లౌడ్‌స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా తాజాగా మొదటి సారిగా ఈ అంశంపై స్పందించారు.
”అందరం కలిసి వుందాం. హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లపై జరుగుతున్న వివాదం నన్నెంతో బాధించింది. ఈ సందర్భంగా కరోనా కాలాన్ని ఓ సారి గుర్తు చేసుకున్నారు. ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, కొట్లాడుకోవడం చూస్తుంటే బాధగా వుంది. గత యేడాదే అందరమూ కలిసి కట్టుగా కరోనా వైరస్‌పై పోరాడాం. రాజకీయ పక్షాలు కూడా భుజం భుజం కలిపి కరోనాపై యుద్ధం చేశాయి. ఆక్సిజన్ల కొరత ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో ఎవ్వరు కూడా మతం, కులం అంటూ మాట్లాడలేదు. కరోనా దేశమంతటినీ ఏకతాటిపైకి నడిపింది. మన బంధాలు మతానికి అతీతంగా ఉన్నాయి” అంటూ సోనూసూద్ పేర్కొన్నాయి.
అద్భుతమైన భారతాన్ని నిర్మించడానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సోనూసూద్ రాజకీయ నేతలకు సూచించారు. మతం అన్న గోడను బద్దలు కొట్టాలని, మానవత్వం ఆధారగానే ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని సోనూసూద్ రాజకీయ నేతలను అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

