Aditya Rajput | ముంబై: నటుడు, మోడల్, క్యాస్టింగ్ డైరెక్టర్ అదిత్య సింగ్ రాజ్‌పుత్ సోమవారం మరణించారు. ముంబైలోని అంధేరి సబర్బన్‌లో ఉన్న తన అపార్ట్మెంట్లోని బాత్రూమ్లో విగతజీవుడై కనిపించాడు. అయితే ఆదిత్య సింగ్ మృతిలో ఇప్పటి వరకూ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. రాజ్‌పుత్(33)కు కొన్ని రోజులుగా అరోగ్యం బాగోలేదని, ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బాత్రూమ్లో కుప్పకూలాడని ఓ అధికారి పేర్కొన్నారు. ఆదిత్య సింగ్ విగతజీవుడై ఉండటాన్ని మొదట పని మనిషి గుర్తించారు.