Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
Abhijeet Dipke : లెహ్రా దో తిరంగా పేరుతో శుక్రవారం సాయంత్రం ర్యాలీ చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
Abhijeet Dipke : లెహ్రా దో తిరంగా పేరుతో శుక్రవారం సాయంత్రం ర్యాలీ చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ ర్యాలీకి వెళ్తున్న ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేను ఢిల్లీ, ఝండేవాలన్‌లోని నివాసం నుంచి అదుపులోకి తీసుకోగా.. నేహా బోరాను మండి హౌజ్ నుంచి అరెస్టు చేశారు.
వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఉద్రిక్తత తలెత్తింది. అటు పోలీసులు, ఇటు మీడియా.. మధ్యలో దీప్కే మద్దతుదారులతో ఈ ప్రదేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీప్కేను పోలీసులు అరెస్టు చేసి, తమ వాహనంలో తీసుకుని వెళ్లారు. అంతకుముందు దీప్కేకు ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు నోటీసులు ఇచ్చారు. సెంట్రల్ పార్క్ వద్ద దీక్షకు వెళ్లకూడదని సూచిస్తూ.. ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద పోలీసులు ఒక నోటీస్ జారీ చేశారు. అనంతరం.. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు మరో నోటీస్ జారీ చేశారు.
ఈ సమయంలో దీప్కే నివాసం వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. తన అరెస్టు సమయంలో దీప్కే పోలీసులతో ఘర్షణకు దిగారు. సెంట్రల్ పార్క్ వద్ద ఆందోళన చేయడానికి వీల్లేదన్న పోలీసులతో.. మరో చోటును చూపించాల్సిందిగా కోరాడు. మరో ప్రదేశం గురించి తర్వాత చెబుతామని, ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. తానేమీ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని, తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఈ రోజు నిరసన జరగాల్సి ఉన్న కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌ను పోలీసులు మూసివేశారు. పార్క్ వద్ద ఆంక్షలు విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీంతో సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ రెండు రోజులక్రితం ఢిల్లీ పోలీసులు సీజేపీ అగ్రనేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తిహార్ జైలులో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

