ఎల్జీ నోటీసులకు భయపడేది లేదు : ప్రతులను చించేసిన ఆప్ నేత
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు. ఎల్జీ సక్సేనాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
తాము లేవనెత్తిన ప్రశ్నలకు ఎల్జీ బదులివ్వకుండా తమను లీగల్ నోటీసులతో బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ లీగల్ నోటీసులకు తాను భయపడబోనని అంటూ సంజయ్ సింగ్ ప్రతులను ముక్కలుగా చించివేశారు.2.5 లక్షల మంది కళాకారుల సొమ్మును ఎల్జీ లూటీ చేశాడని ఆరోపించారు. ఆయన అవినీతిని తాము బట్టబయలు చేస్తే లీగల్ నోటీసులు ఇప్పించాడని అన్నారు. తాను ఇలాంటి పది లీగల్ నోటీసులను చించేస్తానని అన్నారు.
కళాకారుల సొమ్మును ఎక్కడ దాచాడో నిగ్గుతేల్చేందుకు ఎల్జీ సక్సేనాపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరారు. కాగా తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని అతిషి, సౌరవ్ భరధ్వాజ్, దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్, జాస్మిన్ షా సహా పలువురు ఆప్ నేతలకు ఎల్జీ సక్సేనా సోమవారం లీగల్ నోటీసులు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

