AAP | ఆ ఎంపీలపై వేటు వేయండి.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి
AAP | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున ఎంపికై బీజేపీ (BJP) లో చేరిన ఆ ఏడుగురు రాజ్యసభ సభ్యుల (Rajya Sabha Members) పై అనర్హత వేటు వేయాలని ఆప్ కోరింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radha Krishnan) కు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వినతిపత్రం సమర్పించారు.
AAP : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున ఎంపికై బీజేపీ (BJP) లో చేరిన ఆ ఏడుగురు రాజ్యసభ సభ్యుల (Rajya Sabha Members) పై అనర్హత వేటు వేయాలని ఆప్ కోరింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radha Krishnan) కు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన ఆప్ ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఆప్ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరారని సంజయ్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో వారి సభ్యత్వాలను రద్దు చేయాలని తాము రాజ్యసభ ఛైర్మన్‌ను కోరామని తెలిపారు. ఇలాంటి ఫిరాయింపులు ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాము రాజ్యాంగ నిపుణులను సంప్రదించామని, చట్టప్రకారం ఆ ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇదిలావుంటే బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరైన హర్భజన్ సింగ్‌కు కేటాయించిన భద్రతను పంజాబ్ పోలీసులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. 9-10 మంది పోలీసులతో కూడిన సెక్యూరిటీని తొలగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే జలంధర్‌లోని ఛోటీ బారాదరీ ప్రాంతంలో ఉన్న హర్భజన్ నివాసం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు. బీజేపీలోకి వెళ్లడాన్ని నిరసిస్తూ శనివారం ఆప్ కార్యకర్తలు హర్భజన్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

