Uttrakhand Polls | నిరుద్యోగ యువతకు రూ . 5000 నగదు సాయం : ఆప్
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచుతామని, అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో నాలుగో వంతు విద్యకు కేటాయిస్తామని ఆప్ స్పష్టం చేసింది. ప్రతినెలా 300 యూనిట్ల వరకూ ఉచిత్ విద్యుత్ ఇస్తామని, అన్ని గృహాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొంది. ప్రతి కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ 5000 అందచేస్తామని భరోసా ఇచ్చింది.
18 ఏండ్లు పైబడిన మహిళలకు నెలకు రూ వేయి అందిస్తామని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను సైతం ఐఐటీ, ఎయిమ్స్‌లో చేరేలా నాణ్యమైన విద్య అందిస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులకు ఉచిత తీర్ధయాత్రలు కల్పిస్తామని ఉత్తరాఖండ్‌ను హిందువుల ఆథ్యాత్మిక రాజధానిగా మలుస్తామని మ్యానిఫెస్టోలో ఆప్ పేర్కొంది. మాజీ సైనికులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, బిపిన్ రావత్ పేరిట ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణా సంస్ధ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
ఉత్తరాఖండ్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతామని పేర్కొంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో పిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 57 స్ధానాల్లో గెలుపొందింది. తాజా ఎన్నికల్లో విజయంతో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని విపక్ష కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆప్ సైతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సత్తా చాటాలని సన్నద్ధమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- manifesto
- uttrakhand polls
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

