AAP List | 12 మంది ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల
AAP List | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో 12 మంది జాబితాను ఆప్ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆప్.. ఇప్పటివరకు 141 మంది జాబితాను వెల్లడించింది. గుజరాత్ ఎన్నికలు వచ్చే నెల 1,5 తేదీల్లో రెండు విడతల్లో జరుగనున్నాయి.
AAP List | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ తరపున బరిలో నిలిచే మరో 12 మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ప్రకటించింది. ఆప్ ఇప్పటివరకు 141 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.
వరచా రోడ్ నుంచి అల్పేష్ కత్రియా, ఓల్పాడ్ నుంచి ధార్మిక్ మాల్వియాను ఆప్ రంగంలోకి దింపింది. అల్పేష్, ధార్మిక్ మాల్వియా ఇద్దరూ పాటిదార్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఇటీవలనే వారు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాగా, గాంధీధామ్ నుంచి బీటీ మహేశ్వరి, దాంతా నుంచి ఎంకే బొంబాడియా, పలన్పూర్ నుంచి రమేశ్ నభాని, కాంక్రేజ్ నుంచి ముఖేశ్ ఠక్కర్ రాధన్పూర్ నుంచి లాల్జీ ఠాకూర్, మోడాసా నుంచి రాజేంద్ర సింహ్ పార్మర్, రాజ్కోట్ (ఈస్ట్) రాహుల్ భువా, రాజ్కోట్ (వెస్ట్) నుంచి ధినేష్ జోషి, కుటియానా నుంచి భీమ్భాయ్ దనభాయ్ మక్వానా, బోటాడ్ నుంచి ఉమేష్ మక్వానాలకు ఆప్ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. గుజరాత్లోని మొత్తం 182 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

