Viral Video : దుబాయ్‌లో చెఫ్ రణ్వీర్ బ్రార్ ఏర్పాటు చేసిన తొలి రెస్టారెంట్ కష్కన్ వినూత్న రుచిని అందించడంతో పాటు పసందైన స్పెషల్ డిష్‌ను ప్రవేశపెట్టింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రసిద్ధి చెందిన భారతీయ వంటకం దాల్ కష్కన్ను ప్రవేశపెట్టింది.
ఈ స్పెషల్ డిష్‌ను 24క్యారెట్‌తో తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. 58 దీర్హామ్స్ విలువైన (దాదాపు రూ. 1300) ఈ స్పెషల్ దాల్ ప్రత్యేక మసాలా దినుసులు, స్వచ్ఛమైన నెయ్యితో తయారుచేశారు. ఈ పప్పను 24 క్యారెట్ గోల్డ్ పౌడర్‌ను చల్లిన అనంతరం సర్వ్ చేస్తారు. చెక్కతో కూడిన బాక్స్‌లో ఈ స్పెషల్ దాల్‌ను వడ్డిస్తారు.
మెహుల్ హింగు అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట ఈ క్లిప్ తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో డిష్ ప్రత్యేకతలను సర్వర్ కస్టమర్‌కు వివరించడం కనిపిస్తుంది. దుబాయ్ ఫెస్టివల్ మాల్లో రణ్వీర్ బ్రార్‌కు చెందిన కష్కన్ రెస్టారెంట్లో 24 క్యారెట్ గోల్డెన్ తడ్కే వాలి దాల్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Read More :
Lok Sabha | నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..?