HomeNationalA Teacher Was Sentenced To Three Years In Jail For Slapping A Student
విద్యార్థినిపై చెంపదెబ్బ.. టీచర్‌కు మూడేండ్ల జైలు
విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓ టీచర్‌కు న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష విధించింది. టీచర్ చెంపదెబ్బ కారణంగా.. 9వ తరగతి విద్యార్థిని ఎడమ చెవి కర్ణభేరి దెబ్బతిని, వినికిడి లోపం ఏర్పడింది.
గాంధీనగర్: విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓ టీచర్‌కు న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్ష విధించింది. టీచర్ చెంపదెబ్బ కారణంగా.. 9వ తరగతి విద్యార్థిని ఎడమ చెవి కర్ణభేరి దెబ్బతిని, వినికిడి లోపం ఏర్పడింది. ఈ ఘటన 2020 జనవరి 1న గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చోటుచేసుకుంది. పారుల్బెన్ పటేల్ అనే టీచర్‌కు మూడేండ్ల మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.50 వేలు జరిమానా విధించారు.