అవినీతిపై నిరాహార దీక్ష చేస్తూ మృతి
అవినీతికి వ్యతిరేకంగా నాలుగు నెలలుగా నిరాహారదీక్ష చేస్తున్న ఓ సామాజిక కార్యకర్త తుదిశ్వాస విడిచారు.
మథుర, జూన్ 13: అవినీతికి వ్యతిరేకంగా నాలుగు నెలలుగా నిరాహారదీక్ష చేస్తున్న ఓ సామాజిక కార్యకర్త తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా దవాఖానలో మృతి చెందినట్టు అధికారులు గురువారం వెల్లడించారు. మాంట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆదేశ్‌కుమార్ వివరాల ప్రకారం.. జిల్లాలో అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని దేవకీనంద్శర్మ (66) గతంలో గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపారు. కానీ, వారిచ్చిన నివేదికను శర్మ వ్యతిరేకించారు.
అవినీతికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 నుంచి ఒక ఆలయం వెలుపల నిరాహార దీక్షకు కూర్చున్నారు. శర్మ ఆరోగ్యం క్షీణించడంతో దవాఖానకు తరలించగా గురువారం తుదిశ్వాస విడిచారు. ‘నేను సోమవారం శర్మను కలిశాను. అవినీతి విషయంపై ఉన్నతాధికారులకు వివరించినందున నిరాహార దీక్ష విరమించాలని అభ్యర్థించాను. కానీ, ఆయన రాతపూర్వక హామీ కోసం పట్టుబట్టారు. అలా రాసి ఇవ్వడం నా అధికార పరిధిలో లేదు అని చెప్పాను’ అని ఎస్డీఎం ఆదేశ్‌కుమార్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

