వ్యాక్సిన్ వేసుకుంటే సగం ధరకే హెయిర్ కటింగ్..!
50 percent discount for hair cut: ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్న ప్రచారం కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.

చెన్నై: కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా సెకండ్ వేవ్.. ఫస్ట్ వేవ్ కంటే తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ నిబంధనలు, వ్యాక్సినేషన్ కారణంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్న ప్రచారం కారణంగా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఓ హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు. వ్యాక్సిన్ వేయించుకుని సర్టిఫికెట్తో తన వద్దకు వచ్చే కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్‌తో హెయిర్ కట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను ఈ ఆఫర్ ఇచ్చానని, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే అందరం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సెలూన్ యజమాని కార్తికేయన్ పేర్కొన్నాడు.
Tamil Nadu: A salon in Madurai offers a 50% discount to customers coming in with their #COVID19 vaccination certificates
— ANI (@ANI) June 20, 2021
Salon's owner Karthikeyan says, "We offer 50% off to vaccinated customers to raise awareness about the vaccine. We should be vaccinated to avoid the 3rd wave" pic.twitter.com/K1LjfzfCUE
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Covid vaccine
- Madurai
- Salon
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

