డీఎంకే నేత రాజాపై 48 గంటల పాటు ప్రచార నిషేధం..

న్యూఢిల్లీ: డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు అని తన ఆదేశాల్లో పేర్కొన్నది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఓ ప్రచార సభలో రాజా మాట్లాడుతూ.. సీఎం పళనిస్వామి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో ఏ రాజా క్షమాపణలు కూడా చెప్పారు. రాజా చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నట్లు ఉన్నాయని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్నికల సంఘం ఆరోపించింది. ఏప్రిల్ ఆరో తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

