South Peru | దక్షిణ పెరూలో గురువారం దక్షిణ ఆండీస్ పర్వత( Southern Andes Mountainsప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం(Massive earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే మధ్యాహ్నం 1 గంటకు ఈ భూకంపం సంభవించిందని, అయకుచో ప్రాంతంలోని ఉపాహుచో సమీపంలో 66.7 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం నమోదైంది. ఈ భూకంపం ప్రభావంతో అనేక దక్షిణ ప్రాంతాలలో కనిపించింది.
అలాగే అరేకిపా వంటి ప్రధాన ప్రాంతాలలో కూడా ప్రకంపనలు తీవ్రమయ్యాయి. కాగా, భూకంప కార్యకలాపాలు జరిగే ప్రాంతమైన పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్”లో భాగమైన పెరూలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2007లో ఇకా ప్రాంతంలోని ఒక ప్రావిన్స్‌లో సంభవించిన 7.9 తీవ్రత గల భూకంపం వల్ల దాదాపు 600 మంది మరణానికి కారణమైంది.