హెల్మెట్ పెట్టుకోలేదని ఎలక్ట్రిసిటీ లైన్మెన్కు పోలీసులు భారీ ఫైన్ వేశారు. ఇది ఆ లైన్మెన్తోపాటు విద్యుత్‌శాఖకూ కోపం తెప్పించింది. పోలీస్ స్టేషన్ బకాయిలను సాకుగా చూపుతూ విద్యుత్ కనెక్షన్ కట్‌చేశారు. కరెంట్ కట్ చేసేందుకు లైన్మెన్ పోల్ ఎక్కుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
యూపీలోని షామ్లీకి చెందిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్కు ఠానా భవన్ పోలీసులు హెల్మెట్ లేదనే కారణంతో రూ. 6వేల ఫైన్ వేశారు. దీంతో ఆ లైన్మెన్ పోలీసులపై పగతీర్చుకోవాలనుకున్నాడు. ఆ స్టేషన్ కరెంట్ బిల్లు బకాయిలను చెక్ చేశాడు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి ఆదేశంతో ఠానా భవన్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ చీకటిమయమైపోయింది. ఓ రోజు రాత్రంతా కారు చీకట్లోనే ఉండిపోయింది.