Teacher Drink | మహిళా ప్రిన్సిపల్ ముందు మద్యం సేవించిన ఉపాధ్యాయుడు
Teacher Drink | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్‌తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్యాయుడు మద్యం సేవించి, తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించాడు.
Teacher Drink | రాయ్‌పూర్ : పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్‌తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్యాయుడు మద్యం సేవించి, తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
బిలాస్పూర్ జిల్లా మస్తూరి బ్లాక్‌లోని మచ్చా జనపద్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన టీచర్ సంతోష్ కేవాత్.. స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నాడు. అదే గదిలో మహిళా ప్రిన్సిపల్ కూడా తన చైర్లో ఉన్నారు. అయితే ఆమె ముందే.. మద్యం బాటిల్ ఓపెన్ చేసి రెండు, మూడు పెగ్‌లు కొట్టాడు. టేబుల్‌పై ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి పట్ల అతను దురుసుగా ప్రవర్తించాడు. బెదిరింపులకు గురి చేశాడు.
ఈ వీడియో జిల్లా విద్యాధికారి వద్దకు చేరింది. తక్షణమే సంతోష్ కేవాత్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ వివాదాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, స్కూల్లోనే మద్యం సేవించానని సంతోష్ సమర్థించుకున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

