Fire crackers Explosion | క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుళ్ల ఘటన.. కుప్పకూలిన భవనం.. తొమ్మిదికి చేరిన మృతులు
Fire crackers Explosion | తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవన శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కాగా, మృతుల్లో క్రాకర్స్ ఫ్యాక్టరీ ఓనర్ రవి, ఆయన భార్య జయశ్రీ, కుమార్తె, రుతిక, కుమారుడు రుతీష్ ఉన్నారు. వారితోపాటు ఫ్యాక్టరీ పక్కనే హోటల్ నడుపుతున్న రాజేశ్వరి, వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న ఇబ్రహీమ్, ఇమ్రాన్, వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సరసు, జేమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, మొత్తం 15 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో వ్యక్తిని భవన శిథిలాల నుంచి ప్రాణాలతో వెలికితీశారని అధికారులు తెలిపారు.
స్థానికంగా పనిచేసే మరో ఐదుగురి జాడ తెలియకపోవడంతో వారు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారిని సురక్షితంగా బయటికి తీసేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

