buses collision in Tamil Nadu | రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి, 40 మందికి గాయాలు
buses collision in Tamil Nadu | ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది.
చెన్నై: ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (buses collision in Tamil Nadu) కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరుగవచ్చని తెలుస్తున్నది. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కరైకుడి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు, మదురై వైపు వెళ్తున్న మరో ప్రభుత్వ బస్సు తిరుపత్తూరు సమీపంలోని రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి.
కాగా, ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని ప్రయాణికులు చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు.
మరోవైపు గాయపడిన 40 మందిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Student Jumps From School Building | 52 సార్లు సారీ.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన విద్యార్థి
14 Bills To Be Introduced | పార్లమెంట్లో 14 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం.. అవి ఏవంటే?
SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

