నిన్న కూలీ.. నేడు మోడల్.. ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారి లక్షలు సంపాదిస్తున్నాడు
మామ్మిక్కాను ఫోటో తీసి దాన్ని తన సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశాడు షరీక్. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. అచ్చం నటుడు
అతడి పేరు మామ్మిక్కా. వయసు 60 ఏళ్లు. కేరళలోని కొజికోడ్ జిల్లా. కూలీ పని చేస్తూ జీవనాన్ని సాగించే మామ్మిక్కాకు అదృష్టం తలుపుతట్టింది. దీంతో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. మోడల్ అయిపోయి.. పలు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయాడు. నిన్నటి దాకా రోజుకు 100 రూపాయల కూలీకి పనిచేసిన వ్యక్తి నేడు లక్షలు సంపాదిస్తున్నాడు. ఇదంతా ఎలా సాధ్యం అయింది.. నమ్మశక్యంగా లేదు కదా.. పదండి.. ఓసారి మామ్మిక్కాను పలకరించి వద్దాం.
నిజానికి.. మామ్మిక్కా జీవితం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడానికి కారణం ఫోటోగ్రాఫర్ షరీక్ వాయాలిల్. మామ్మిక్కాను చూసి.. అతడిలో ఏదో ఉందని గమనించి.. అతడిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేశాడు. మోడల్‌ను చూసి జీవితం ఇచ్చాడు.
మామ్మిక్కాను ఫోటో తీసి దాన్ని తన సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశాడు షరీక్. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు.. అచ్చం నటుడు వినాయకన్లా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో మామ్మిక్కాను ఎలాగైనా మోడల్ చేయాలని అనుకున్నాడు షరీక్.
తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా ఉండాలని మామ్మిక్కాను కోరాడు. వెంటనే బ్యూటీ పార్లర్‌కు తీసుకెళ్లి మామ్మిక్కాకు మేకోవర్ చేసి.. సూట్ వేసి ఫోటోషూట్ తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆఫోటోలకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఇతర కంపెనీలు కూడా మామ్మిక్కాను తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ కబురు పంపాయట. మోడల్‌గా కొనసాగుతూనే తన కూలీ పనిని కూడా చేస్తానని.. అన్నం పెట్టిన ఆ పనిని వదులుకోనని ఈసందర్భంగా మామ్మిక్కా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మోడల్‌గా లక్షలు సంపాదిస్తూ తన జీవితాన్ని ఒక్క రోజులో మార్చేసుకున్నాడు మామ్మిక్కా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

