ఎంపీలో ఆరుగురి కాల్చివేత
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. మొరెనా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది.
- పాత కక్షలతో ఒకే కుటుంబానికి చెందిన వారిపై దాడి, హత్య
- పలువురికి గాయాలు
భోపాల్, మే 5: మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. మొరెనా జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేప గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ మధ్య చెత్త డంపింగ్‌కు సంబంధించి 2013 నుంచి వివాదం ఉంది.
అ సందర్భంగా జరిగిన ఘర్షణలో ధీర్సింగ్ కుటుంబాన్ని హత్య చేసిన గజేంద్ర సింగ్ కుటుంబం గ్రామం నుంచి పారిపోయింది. తర్వాత ఈ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కోర్టు బయట ఒప్పందం జరిగింది. దీంతో గజేంద్ర సింగ్ కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. అయితే గతంలో తమవారిని హత్యచేసిన వారిని ఎలాగన్నా చంపాలని ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ధీర్ సింగ్ కుటుంబానికి చెందిన వారు వారిపై తుపాకులు, కర్రలతో దాడి చేశారు. వారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కాల్చి చంపారు. మరణించిన వారిలో గజేంద్ర సింగ్, అతని ఇద్దరు కుమారులు సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకులను హతమార్చాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

