గోదాంలో అగ్నిప్రమాదం.. 6 కార్లు సహా 14 వాహనాలు దగ్ధం
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గుర్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని గుర్గావ్ ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 14 వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఇందులో ఆరు కార్లు, ఏడు బైకులు, ఓ స్కూటర్, ఆటో ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అయితే రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఫైర్‌ఇంజిన్లు రావడానికి ఆలస్య మయిందని స్థానికులు తెలిపారు.
దీంతో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి శ్రమ వృధా అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ గోదామ్‌ను చాలా కాలం క్రితమే మూసివేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారాలు ఇంకా తెలియరాలే. అయితే పటాకులు పేల్చడం వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

