బెంగళూరులో 543 మంది పిల్లలకు కరోనా

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గ్రేటర్ బెంగళూరు నగర పాలిక అధికారులు తెలిపారు. 499 కొత్త కేసుల్లో 263 కేసులు గత ఐదు రోజుల్లో నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 88 కేసులు 9 ఏండ్లలోపు చిన్నారులు కాగా, 175 కేసులు 10-19 ఏండ్ల పిల్లలని వివరించారు. అయితే చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు లేకపోవడం లేదా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదని చెప్పారు.
పిల్లల్లో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్రమాదకరంగా మారవచ్చని బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో చిన్నారుల కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కరోనా టీకా వేయించుకోవాలని, రద్దీ ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో 9-12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధం కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

