భారత్ బయోటెక్.. 50 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్!
భారత్ బయోటెక్ | కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్థ

హైదరాబాద్ : కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు. అయితే టీకాల సరఫరా విషయంలో తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్ర్టాలు చేస్తున్న ఫిర్యాదుల పట్ల సుచిత్ర ఎల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ర్టాలకు కొవాగ్జిన్‌ను షిప్‌మెంట్స్‌లో పంపామని ట్విటర్లో పేర్కొన్నారు. తమ ఉద్దేశాలపై కొన్ని రాష్ర్టాలు చేస్తున్న ఫిర్యాదులు తమకు నిరుత్సాహం కలిగిస్తున్నాయన్నారు. కొవిడ్ కారణంగా 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేరని, అయినప్పటికీ మీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు.
అయితే ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలోనే 50 మంది ఉద్యోగులకు కరోనా వస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ టీకా పని చేయడం లేదా? అని కొందరు అడిగారు. లేక వారికి టీకా ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాత్కాలిక నియామకాలు జరుపొచ్చు కదా? అని సూచించారు. మరో నెటిజన్ స్పందిస్తూ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అహర్నిశలు కష్టపడుతున్న మీ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Covaxin dispatched 10/5/21.18 states have been covered thou in smaller shipments. Quite disheartening to the teams to hear Some states complaining about our intentions. 50 of our employees are off work due to covid, yet we continue to work under pandemic lockdowns 24×7 for U 🇮🇳 pic.twitter.com/FmQl4vtqXC
— Suchitra Ella (@SuchitraElla) May 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

