భూవివాదం : ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు.. ఐదుగురు మృతి
భూవివాదం | బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

నలంద : బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోరం జరిగింది. దశాబ్ద కాలం నాటి భూవివాదం ఐదుగురు ప్రాణాలను బలిగొంది. ఓ వర్గంపై మరో వర్గం కాల్పులు జరపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలంద జిల్లా ఛబీలాపూర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఇరువర్గాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో ఇవాళ ఓ వర్గం భూమిని దున్నుతుండగా.. మరో వర్గానికి చెందిన వారు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నలంద ఎస్పీ హరిప్రశాంత్ తెలిపారు. భూ వివాదంపై ఇరువర్గాలు కోర్టులోనూ పోరాడుతున్నారని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బలగాలు మోహరించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Firing
- land dispute
- Nalanda
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

