Migration | ధనిక దేశాలను వెతుక్కుంటూ.. వలస వెళ్తున్న భారతీయులు
స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం పారిస్‌లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2024లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
- 2022లో భారత్‌ను వీడిన 5.6 లక్షల మంది
- 2021 ఏడాది కంటే ఇది 35 శాతం అధికం
- డ్రీమ్ డెస్టినేషన్‌గా అమెరికా, కెనడా, యూకే
Migration | ముంబై, నవంబర్ 15: స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం పారిస్‌లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2024లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2022లో 5.6 లక్షల మంది భారతీయులు దేశాన్ని వదిలి అమెరికా, యూకే, కెనడా వంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) సభ్య దేశాల్లో స్థిరపడ్డారు. 2021లో 4.11 లక్షల మంది భారతీయులు ఓసీఈడీ దేశాలకు వలస వెళ్లగా, 2022లో ఈ సంఖ్య 35 శాతం అధికంగా ఉంది. భారతీయుల తర్వాత చైనీయులు(3.2 లక్షల మంది) ఉన్నారు. 2022లో కొత్తగా వలసవెళ్లిన విదేశీయుల్లో భారతీయులే 6.4 శాతం ఉన్నారు. 2022లో అమెరికాకు అత్యధికంగా 1.25 లక్షల మంది, కెనడాకు 1.18 లక్షల మంది, యూకేకు 1.12 లక్షల మంది వలసవెళ్లారు.
పౌరసత్వాన్ని వదులుకున్న 1.9 లక్షల మంది
2022లో దాదాపు 1.9 లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకొని ఓఈసీడీ దేశాల పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇది 2021తో పోలిస్తే 40 శాతం అధికం. ఓఈసీడీల్లో పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులే అధికం.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

