Jagdeep Singh | రోజుకు 43 కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగ్దీప్సింగ్
క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు.
Jagdeep Singh | న్యూఢిల్లీ, జనవరి 3: క్వాంటం స్కేప్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జగ్దీప్సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూ.17,500 కోట్లు ఆర్జించారు. అనగా రోజుకు రూ.43 కోట్ల చొప్పున అందుకున్నారు. ప్రపంచంలోని అనేక పేరొందిన కార్పొరేట్ సంస్థలు సైతం ఈ స్థాయిలో వార్షిక ఆదాయాన్ని పొందడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానంలో సాధించిన నైపుణ్యం నేపథ్యంలో ఆయన ప్రఖ్యాతిగాంచారు.
ఆ పరిజ్ఞానంతోనే 2010లో క్వాంటం స్కేప్‌ను స్థాపించారు. ఈ కంపెనీ రేపటితరం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నది. ఈ బ్యాటరీలలో ఇంధన సామర్థ్యం, తక్కువ సమయంలో చార్జింగ్ అనే ప్రత్యేకతలు పలు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలను ఆకర్షించాయి. ఫోక్స్‌వాగన్, బిల్‌గేట్స్ వంటి దిగ్గజాలు క్వాంటం స్కేప్‌లో పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 16న సీఈవోగా రాజీనామా చేసిన జగ్దీప్ సింగ్ ఆ బాధ్యతలను శివశివరాంకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

