Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. ఇందులో 3,13,02,345 మంది బాధితులు కోలుకోగా, మరో 3,85,227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి వల్ల 4,30,254 మంది బాధితులు మరణించారు. ఇక గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు 42,295 కోలుకోగా, మరో 585 మంది మృతిచెందారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 52,95,82,956 డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 57,31,574 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 48,94,70,779 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో ఆగస్టు 12న 19,70,495 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

