న్యూఢిల్లీ, మార్చి 25 : గతంతో పోల్చితే 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారతీయ విద్యా సంస్థలు సత్తాచాటాయి. వివిధ సబ్జెక్టుల్లో నాలుగు ఐఐటీలు, జేఎన్‌యూ, బిట్స్ పిలానీ మొదలైనవి టాప్-50లో చోటు దక్కించుకున్నాయి. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, వివిధ సబ్జెక్టులు, విద్యా విభాగాల్లో విడుదలైన టాప్-50 జాబితాలో 2024లో మొత్తం 12 విద్యా సంస్థలు ర్యాంకింగ్స్‌ను అందుకోగా, తాజా గా ఆ సంఖ్య 27కు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల బోధన, పరిశోధన, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ గుర్తిం పు ఆధారంగా క్యూఎస్ ఏటా ర్యాం కింగ్స్‌ను విడుదల చేస్తున్నది. ‘నాణ్యత, పోటీతత్వంలో భారత విద్యా సంస్థలు ఈ ఏడాది పురోగతి సాధించాయి. ఇంజినీరింగ్, టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో కనపడుతున్న విస్తృత అభివృద్ధి వేగవంతమైన ఒక వ్యవస్థకు సంకేతం’ అని క్యూఎస్ సీఈవో టర్నర్ అన్నారు.