Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్ బాలికల అండాల అమ్మకం.. నలుగురు అరెస్ట్
Minor Girls Eggs Selling | సంతానం కలుగని దంపతులకు మైనర్ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. (Minor Girls Eggs Selling) పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
లక్నో: సంతానం కలుగని దంపతులకు మైనర్ బాలికల నుంచి సేకరించిన అండాలు అమ్ముతున్నారు. (Minor Girls Eggs Selling) పేదింటి బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ చర్యకు పాల్పడుతున్నారు. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్ సెంటర్‌కు వచ్చే జంటలకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయస్సుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి కేవలం రూ.11,500 చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, వారణాసి పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపారు. నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్, ఖోంజ్వాన్ ప్రాంతానికి చెందిన అనితా దేవి, సోన్‌భద్రకు చెందిన అన్మోల్ జైస్వాల్‌ను అరెస్టు చేశారు. ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది, డాక్టర్లకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయసు 23 ఏళ్లకు మించి ఉండాలి. ఆమెకు పెళ్లి కావడంతో పాటు మూడేళ్లకు పైగా వయస్సున బిడ్డ ఉండాలి. అలాగే ఒక మహిళ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే అండం దానం చేసేందుకు అర్హురాలని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

