Sabarimala: శబరిమల ఆలయంలో 33 పాముల పట్టివేత
Sabarimala: శబరిమల ఆలయ పరిసరాల్లో ఈ సీజన్లో 33 పాములను పట్టుకున్నారు. దీంట్లో కామన్ క్రెయిట్(అనాలీ), 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయి. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో నడుస్తున్న సమయంలో అయ్యప్ప భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తిరువనంతపురం: శబరిమల(Sabarimala) అయ్యప్ప మండల దీక్ష సీజన్ మొదలై కొన్ని రోజులే అవుతోంది. అయితే ఇప్పటికే ఆ ఆలయ పరిసరాల్లో 33 పాములను పట్టుకున్నారు. దీంట్లో కామన్ క్రెయిట్(అనాలీ), 14 వైల్డ్ స్నేక్స్ ఉన్నాయి. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో నడుస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సర్పాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాము కాటు సంఘటనలు చాలా తక్కువే నమోదు అవుతున్నట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో శబరిమల క్షేత్రంలో పాములు సంచరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో కింగ్ కోబ్రాలు ఆ ప్రాంతంలో ఉండేవని, కానీ ఇప్పుడు చాలా వరకు విషం లేని సర్పాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాము కాటుకు సంబంధించిన వైద్య చికిత్స సన్నిధానం, పంపా వద్ద అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

