ADR report | కర్ణాటక మంత్రుల్లో 31 మంది కోటీశ్వరులు.. 24 మందిపై క్రిమినల్ కేసులు
Karnataka ministers | కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని 34 మంది మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే. ఇందులో 24 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది.
బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని 34 మంది మంత్రుల్లో దాదాపు అందరూ కోటీశ్వరులే. ఇందులో 24 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం మంత్రుల్లో 97 శాతం మంది కోటీశ్వరులని తెలిపింది. వారి సగటు ఆస్తుల విలువ రూ.119.06 కోట్లుగా పేర్కొంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యధికంగా రూ.1,413.80 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. ముధోల్ (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన మంత్రి తిమ్మాపూర్ రామప్ప బాలప్పకు రూ.58.56 లక్షల కనీస ఆస్తులున్నాయని పేర్కొంది. అలాగే సీఎం సిద్ధరామయ్య కేబినెట్లో ఏకైక మహిళా మంత్రి, బెల్గాం నియోజకవర్గానికి చెందిన లక్ష్మీ ఆర్.హెబ్బాల్కర్కు రూ.13 కోట్ల ఆస్తులు, రూ.5 కోట్ల అప్పులున్నాయని వెల్లడించింది.
కాగా, కర్ణాటక మంత్రుల్లో 24 మంది (75 శాతం) గ్రాడ్యుయేట్, ఆపైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. ఇద్దరు మంత్రులు డిప్లొమా హోల్డర్లు. ఆరుగురు మంత్రులు (19 శాతం) మాత్రం ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి పాస్ అయ్యారని ఏడీఆర్ తెలిపింది. అలాగే 18 మంది మంత్రులు (56 శాతం) 41 నుంచి 60 ఏళ్ల వయస్కులని పేర్కొంది. 14 మంది మంత్రుల (44 శాతం) వయసు 61 నుంచి 80గా తెలిపింది. కర్ణాటక మంత్రులు ఎన్నికల అఫిడవిట్లో ఈ మేరకు తమ వివరాలు పేర్కొన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

