Vehicles collided @ Fog | కర్నాల్ ఎన్‌హెచ్‌పై భారీగా పొగమంచు.. 3 ప్రమాదాల్లో 30 వాహనాలు ధ్వంసం
Vehicles collided @ Fog | హర్యానాలోని కర్నాల్ జాతీయ రహదారిపై 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. భారీగా పొగ మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Vehicles collided @ Fog | హర్యానాలోని కర్నాల్ జాతీయ రహదారిపై భారీగా పొగమంచు కారణంగా మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదాల కారణంగా హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.
కుటేల్ ఓవర్ బ్రిడ్జి దగ్గర తొలి ప్రమాదం జరిగింది. ఇందులో 15, 16 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ట్రక్కులు, కార్లు, ట్రాక్టర్ ట్రాలీలు, బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లుగా తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు హర్యానా రోడ్‌వేస్ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. వీటిలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఇది కాకుండా, హర్యానా రోడ్‌వేస్ బస్సు కింద డస్టర్ కారు నలిగిపోయింది. ఇందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా హైవేపై అక్కడక్కడా వాహనాలు బొమ్మల్లా పడిపోయి ఉన్నాయి.
కాగా, రెండో ప్రమాదం మధుబన్ సమీపంలో జరిగింది. 10-12 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడ కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప దవాఖానకు తరలించి క్షతగాత్రుల బంధువులకు సమాచారమిచ్చారు. మూడో ప్రమాదం కర్నాల్ టోల్ సమీపంలో జరిగింది. పొగమంచు కారణంగా హైవేపై ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 30 వాహనాలు ప్రమాదానికి గురవగా.. 12 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

