బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబులతో దాడి..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు దాడి జరిగింది. కోల్‌కతా సమీపంలోని ఆ ఎంపీ ఇంటి ముందు ఇవాళ మూడు బాంబులను విసిరారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్లో బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించిన అంశాన్ని పోస్టు చేశారు. ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటన జరిగిందని, ఇది ఆందోళనకరంగా ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు. ఎంపీ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తున్నది.
నార్త్ 24 పార్గనాస్ వద్ద ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద ప్రస్తుతం భద్రతా దళాలను మోహరించారు. జగత్దల్ వద్ద ఉన్న ఇంటి ముందు బాంబు దాడి జరిగింది. కోల్‌కతాకు వంద కిలోమీటర్ల దూరంలో జగత్దల్ ఉంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 6.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. పేలుళ్ల వల్ల ఎంపీ ఇంటి ముందు గేట్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ .. హుటాహుటిన కోల్‌కతాకు పయనమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

