Manipur | మణిపూర్లో అర్ధరాత్రి స్వల్ప భూకంపం.. 3.3 తీవ్రత
మణిపూర్లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఇంఫాల్: రెండు కమ్యూనిటీల గొడవతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని ఉక్రుల్ (Ukhrul) జిల్లాలో శనివారం తెల్లవారుజామున 12.14 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 70 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.
భూకంప కేంద్రం ఉక్రుల్కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని చెప్పింది. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించండంతో జనాలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:3.3, Occurred on 08-07-2023, 00:14:10 IST, Lat: 24.90 & Long: 94.35, Depth: 70 Km ,Location: 13km WSW of Ukhrul, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/mVQuDJH27F@KirenRijiju @Indiametdept @ndmaindia pic.twitter.com/hrIiHrCRjS
— National Center for Seismology (@NCS_Earthquake) July 7, 2023
కొనసాగుతున్న హింస..
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి, శుక్రవారం బిష్ణుపూర్ జిల్లా కంగ్వాయి ఏరియాలోని గ్రామాల్లో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో పోలీసు కమాండో, టీనేజర్ ఉన్నారు. కొండ ప్రాంతాల నుంచి కొంతమంది కిందకు వచ్చి, లోయలోని పలు గ్రామాలను తగులబెట్టేందుకు ప్రయత్నించారని, వెనక్కు వెళ్లిపోవాలని స్థానికులు కోరినా పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. ఏ ఇంటికీ నిప్పంటించకుండా భద్రతా బలగాలు నియంత్రించగలిగాయి. అయితే రెండు గ్రూపులకు చెందిన వారు కాల్పులకు దిగారని తెలిపారు.
జమ్ముకశ్మీర్, పంజాబ్లలో గతంలో జరిగిన తారాస్థాయి ఘర్షణల కంటే మణిపూర్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ గుర్బచన్ జగత్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లపై దాడులు జరుగుతున్నాయని, ఆయుధాలు, మందుగుండు సామగ్రి లూటీకి గురైందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో చోటుచేసుకొన్న విపత్కర సమయాల్లో కూడా ఇలాంటివి జరుగలేదని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Manipur
- NCS
- Saturday
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

