Custodial Rape Cases | ఐదేళ్లలో 275 కస్టడీ రేప్ కేసులు.. టాప్‌లో ఉత్తరప్రదేశ్
Custodial Rape Cases | గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్‌లో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నది.
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. (Custodial Rape Cases) జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్‌లో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉన్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం 2017 నుంచి 2022 వరకు మొత్తం 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. 2017లో 89 కేసులు, 2018లో 60, 2019లో 47, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు నమోదయ్యాయి.
కాగా, 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదయ్యాయి. 43 కేసులతో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కస్టడీలో ఉన్న మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో పోలీసు సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యులు, జైళ్లు, రిమాండ్ హోమ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది నిందితులుగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Custodial
- data
- NCRB
- rape cases
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

